19 April, 2026 | 3:20 AM

ప్లాస్టిక్ పూల నిషేధం?

19-04-2026 01:30 AM

సికింద్రాబాద్, ఏప్రిల్ 18(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ పూలపై నిషేధం అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూలను విక్రయించకూడదని, ఎవరైనా అమ్మితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రైతు బజార్లు, ప్రభుత్వ మార్కెట్లలో ఈ నిషేధం అమల్లోకి తెచ్చింది.

ఒకవేళ ఎవరై నా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటూ ప్రకటించింది. సహజ పూలను, వాటి ఉత్పత్తులను మాత్ర మే రైతు బజార్లు, మార్కెట్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లా ల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రైతు మేళాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మంత్రికి  తమ బాధను వెల్లబోసుకు న్నారు. మంత్రి స్పందించి ఈ మేరకు చర్యలు చేపట్టారు.