calender_icon.png 9 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నగదు, మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలి

09-12-2025 12:28:12 AM

  1. భద్రాచలం ఎస్‌ఎస్‌టీ చెక్పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు

పోలింగ్ పూర్తయ్యే వరకు చెక్పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

భద్రాచలం, డిసెంబర్ 8, (విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్య వరకు స్టాటిక్ సర్వేలెయన్స్ టీం చెక్ పోస్ట్ ల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి రోహిత్ రాజ్ ఆదేశించారు. సోమవారంభద్రాచలం బ్రిడ్జి పాయింట్ నందు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన SST (స్టాటిక్ సర్వేలెయన్స్ టీం) చెక్పోస్టును ఆయన తనిఖీ చేశారు. చెక్పోస్టు నందు అధికారులు,సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్పోస్టు వద్ద పనిచేసే అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు.

ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే నగదు,మద్యం వంటి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా అధికారులు భాద్యతగా వ్యవహారించాలని అన్నారు. జిల్లా ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలాభ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఈ సందర్బంగా ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,ఇన్స్పెక్టర్ నాగరాజు,ఎస్త్స్ర సతీష్ , తదితరులు పాల్గొన్నారు.