calender_icon.png 20 August, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు

20-08-2025 05:23:49 PM

నిర్మల్,(విజయక్రాంతి)వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని టీజీ ఎంపీటీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ఆదేశించినట్టు జిల్లా విద్యు శాఖ అధికారి సలియానాయక్ తెలిపారు. బుధవారం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో టెలికాన్ఫిడెన్స్ నిర్వహించి ఆ జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు విద్యుత్ వైర్లను వెంటనే సరి చేయాలని సూచించినట్టు తెలిపారు.

గణేష్ మండపాల నిర్వాకులు తప్పనిసరిగా మండపాల రిజిస్ట్రేషన్ ను విద్యుత్ శాఖకు తెలుపాలని ఆ ప్రాంతంలో విద్యుత్ తీగల వల్ల ప్రమాదం ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించినట్టు తెలిపారు. అనుమతి లేకుండా విద్యుత్ వినియోగించడం చట్ట రిత్యా నేరమని విద్యశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విద్యుత్ వైర్లపై కుండీలు వేయరాదని విద్యుత్ శోభాయాత్ర నిర్వహించి ప్రదేశాల్లోనూ విధిశాఖ అధికారులు తనిఖీ నిర్వహించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.