20-08-2025 04:52:39 PM
హైదరాబాద్: జనగామ జిల్లా(Jangaon District) వడ్డిచర్ల వద్ద బుధవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. నివేదికల ప్రకారం... కుటుంబంతో కలిసి వివాహానికి నెల్లూరు నుంచి కరీంనగర్ కు కారులో వెళ్తుండగా జనగామ-సూర్యపేట జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులు మృతిచెందగా.. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన చిన్నారులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.