calender_icon.png 20 August, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక విగ్రహాల తరలింపులో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

20-08-2025 05:18:57 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 27న జరిగే వినాయక చవితి పండుగ సందర్భంగా తరలించే విగ్రహాల విషయంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బెల్లంపల్లి విద్యుత్ కాంపౌండ్ లో జరిగిన సమావేశంలో అధికారులతో మాట్లాడారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించి ప్రమాదకరంగా ఉన్న లైన్ ఇలా ఎత్తును పెంచాలని సూచించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ భద్రత చర్యలు పాటించాలని కోరారు.

విగ్రహాల ఎత్తును బట్టి రూటు నిర్ణయించుకోవాలని ఎక్కడైనా సమస్యలు ఉంటే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. మెటల్ ప్రేమతో కూడిన డెకరేషన్ లను వీలైనంతవరకు తగ్గించాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కువ వద్దని, విద్యుత్ సిబ్బంది ద్వారా మాత్రమే కనెక్షన్ పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఐఎస్ఐ మార్క్ కలిగిన విద్యుత్ వైర్లను మాత్రమే ఇందుకు వాడాలని కోరారు.

వినాయక నిమజ్జనాల రూట్లు అన్ని తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ వైర్లు తెగిపడిన, అత్యవసర పరిస్థితులు ఏర్పడిన వెంటనే 1912 కు కాల్ చేసి విద్యుత్ సిబ్బందికి తెలపాలన్నారు. అనంతరం గాంధీ నగర్ లో గల వినాయకుల తయారీ కేంద్రాన్ని విద్యుత్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ట్రాన్స్కో ,డి ఈ రాజన్న , ఏ డీ ఈ రవివర్మ తో పాటు ఏఈలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.