12-07-2024 02:50:48 AM
గద్వాల (వనపర్తి), జూలై 11 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి కేటా యించబడిన 2023 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ కలెక్టర్లు వికరాబాద్ జిల్లా ఉమా హారతి, నిజమాబాద్ జిల్లా అజ్మీర సంకేత్ కుమార్, నారాయణపేట జిల్లా గరిమ నరుల, అదిలాబాద్ జిల్లా అభిగ్యాన్ మాల్వియా, కరీంనరగ్ జిల్లా అజయ్ యాదవ్, ఖమ్మం జిల్లా మృనాల్ శ్రేష్ట, సంగారెడ్డి జిల్లా మనోజ్ గురువారం కలెక్టర్ సంతోష్‌తో కలిసి జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ది సంక్షే మ కార్యక్రమాల విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్ర ంలోని రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికులను కలిసి చేనేత మగ్గాలు, వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి, అమ్మవారిని ట్రైనీ కలెక్టర్లు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు , చేనేత జౌళి శాఖ అధికారి గోవిందయ్య, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.