12-07-2024 02:51:21 AM
మేడిపల్లి, జూలై 11: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలక లగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, తిరుమలగిరి, అల్వాల్, కవాడిగూడ, దోమల గూడ, విద్యానగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, అడిక్‌మెట్, గాంధీనగర్, బేగంపేట్, మారేడ్‌పల్లి, బంజారాహిల్స్, మల్కాజిగిరి, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ, ఏఎస్‌రావునగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే మూడు రోజులు నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.