calender_icon.png 2 August, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండ్ల తోటల సాగుపై రైతులకు శిక్షణ

01-08-2025 11:19:55 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక ఆర్థిక సౌజన్యంతో ఉద్యాన పంటల సాగుపై మల్యాల జే.వి.ఆర్ ఉద్యాన పరిశోధన స్థానంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. షెడ్యూల్ కులాలకు చెందిన రైతులకు ఉద్యాన పంటల సాగు, వాణిజ్య పంటల సాగు, చీడపీడల నివారణ, సేంద్రీయ విధానం తదితరు అంశాలపై శిక్షణ నిర్వహించారు. అనంతరం రైతులకు మామిడి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా హార్టికల్చర్ అధికారి జినుగు మరియన్న, పరిశోధనా స్థానం అధిపతి కత్తుల నాగరాజు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ క్రాంతి కుమార్, శాస్త్రవేత్తలు  ప్రశాంత్, సుహాసిని పాల్గొన్నారు. జిల్లా పరిధిలో వీలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబలను సాధించిన పలువురు రైతులను శాస్త్రవేత్తలు అధికారులు సన్మానించారు.