01-08-2025 11:17:42 PM
డిఆర్ఎమ్ కు ఎమ్మెల్యే విజ్ఞప్తి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక వసతులతో పాటు, రైల్వే వర్క్ షాప్ ఏర్పాటు, కొత్తగా జీటీ, తమిళనాడు, వందే భారత్, ఎల్టిటి, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం గోపాలకృష్ణన్(DRM Gopalakrishnan)కు ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ విజ్ఞప్తి చేశారు. డిఆర్ఎం శుక్రవారం ప్రత్యేక రైలు ద్వారా మహబూబాబాద్, వరంగల్ జిల్లాలోని రైల్వే స్టేషన్లతో పాటు ఈ మార్గంలో నిర్వహిస్తున్న రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఎమ్మెల్యేతో పాటు వివిధ పార్టీల నాయకులు మహబూబాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులపై డిఆర్ఎంకు వినతి పత్రాలు అందజేశారు. ఇందులో ప్రధానంగా ఇటీవల ప్రాథమికంగా రైల్వే శాఖ ప్రతిపాదించిన ప్రైట్ మెయింటెనెన్స్ వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని, మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని, కొత్త రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు.