14 August, 2026 | 2:58 AM

డీఈవో, ఎంఈవో, ఆర్జేడీలకు శిక్షణ

14-08-2026 01:30 AM
  1. ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని 
  2. ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహణ

హైదరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): రాష్ట్రంలోని ఎంఈవోలు, జిల్లా విద్యాధికారులు, ఆర్జేడీలు, ఉన్నత విద్యాధికారులకు గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యో గితా రాణా, ఐఏఎస్ మాట్లాడుతూ ప్రస్తు తం విద్యార్థుల పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ మన లక్ష్యం దృష్ట్యా అభ్యసన స్థాయిలు ఇంకా తక్కువుగానే ఉన్నాయన్నా రు.

మన ప్రధాన దృష్టి అంతా అభ్యసన స్థా యిలకు వేగంగా మెరుగపరచడంపై ఉంచాలన్నారు. ప్రతి మండల విద్యాధికారి కేవలం కార్యక్రమాల గురించి కాకుండా తరగతి వా రీగా ఎఫ్‌ఎల్‌ఎన్ సామర్థ్యాలు, లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. డీఈవోలు ప్రతి నెల కనీసం 12 ప్రాథమిక పాఠశాలలను, ఎంఈవోలు ప్రతి నెల కనీసం ప్రాథమిక పాఠశాలలను సందర్శించాలని సూచించారు. గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ గతంలో జనగామలో తాను ఎఫ్‌ఎల్‌ఎన్ కోసం అమ లు పర్చిన వ్యూహాల గురించి వివరించారు.

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడు తూ అకాడమిక్ ప్యానెల్ ఇన్ఫెక్షన్ ద్వారా వారి జిల్లాలో సాధించిన ప్రగతి వివరించా రు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వారి జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థుల నమోదు సాధించడానికి చేపట్టిన వ్యూహాలను వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని విద్యార్థుల అ భ్యసన స్థాయిలను మెరుగుపర్చాలన్నారు.