calender_icon.png 19 May, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామర్థ్య నిర్మాణంపై ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణ

19-05-2025 06:12:43 PM

మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్..

హుజురాబాద్ (విజయక్రాంతి): సామర్ధ్య నిర్మాణంపై ఉపాధ్యాయులకు ఐదు రోజుల ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎం లు & ఎస్జిటి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్(Mandal Education Officer Bhupathi Srinivas) తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఎమ్మార్సీభవన్ లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల ఇన్-సర్వీస్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మండల వనరుల కేంద్రంలో శిక్షణకి రిసోర్స్ పర్సన్స్ తో ముందస్తు ప్రణాళిక అంశాలను చర్చించారు. 

ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు శిక్షణ లేదని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు శిక్షణ ఉంటుంది. పాల్గొనేవారి హాజరును తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ పర్యవేక్షిస్తుందన్నారు. చెక్ ఇన్, చెక్ అవుట్ సమయం చాలా ముఖ్యం అని సూచించారు. శిక్షణలు ఒకే దశలో నిర్వహించబడతాయి. ఏ ఉపాధ్యాయునికీ మినహాయింపు లేదు అని తెలిపారు. జూలై 2025 వరకు పదవీ విరమణ చేయబోయే ఉపాధ్యాయులకు శిక్షణ నుండి మినహాయింపు ఉందన్నారు. ఉపాధ్యాయులు తమ బోధనా సబ్జెక్టు యొక్క పాఠ్యపుస్తకాలను విధిగా తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గాజుల ఆంజనేయులు, పత్తేం శ్రీనివాస్, ముశం సత్యరాజం, దానెంపల్లి శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్, తంగేళ్లపల్లి శ్రీనివాస్, దోమల సదానందం, సాహెదా సల్మాతో పాటు తదితరులు పాల్గొన్నారు.