calender_icon.png 18 June, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సంఘం పదాధికారులకు శిక్షణ

17-06-2025 09:45:15 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండల మహిళా సమాఖ్య పరిధిలోని గ్రామ సంఘం పదాధికారులకు మంగళవారం దోమకొండ ఐకెపి కార్యాలయం నందు జిల్లా సీఆర్పీలు శిక్షణ ఇవ్వడం జరిగినది. శిక్షణలో పదాధికారుల విధులు, బాధ్యతలు, ఆర్థిక లావాదేవీల నిర్వహణ, సంఘ సమావేశాలు, పుస్తక నిర్వహణ, జీవనోపాదుల పెంపుదల అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ శిక్షణ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ హాజరై శిక్షణ అనంతరం మండలంలోని మహిళా సంఘాల బలోపేతానికి సభ్య కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేయాలని తెలపడం జరిగినది. ఈ శిక్షణలో APM రాజు, సిసిలు, గ్రామ సంఘం పదాధికారులు పాల్గొన్నారు.