calender_icon.png 9 September, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుకాణదారులు, హోటల్, వ్యాపార నిర్వాహకులకు శిక్షణ తప్పనిసరి

08-09-2025 12:00:00 AM

ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకురాలు కుంచాల భార్గవి

కామారెడ్డి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) ః దుకాణ వ్యాపార యజమానులు ఆరభద్రత శిక్షణ పొంది వినియోగదారులకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించాలని ఆహార భద్రత అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకురాలు కంచాల భార్గవి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో వ్యాపారులకు, దుకాణదారులకు ఓటల్ నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

శిక్షణ తరగతులను MCEౄ (మహారాష్ట్ర సెంటర్ ఫర్ ఇంటర్ ఫ్రీనర్షిప్ డెవలప్మెంట్) వారి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ స్టాండరడ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Fssai) శిక్షకురాలు భార్గవి కంచాల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.... దుకాణ వ్యాపార యజమానులు ఆహార భద్రత శిక్షణ పొంది వినియోగదారు లకు నాణ్యమైన ఆహారా ఉత్పత్తులు అందించాల న్నారు.

దుకాణ వ్యాపార సముదాయాలలో శుచి శుభ్రత పాటించాలి. హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాలలో ఫుడ్ కలర్స్, టెస్టింగ్ సాల్ట్ వినియోగించరాదని అన్నారు. ఒక్కసారి వినియోగించిన వంట నూనెను మూడుసార్లు కంటే ఎక్కువ వినియోగించరాదని తెలిపారు. హోటల్స్, దుకాణ సముదాయాలలో ఆహార పదార్థాలను పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

దుకాణ యజమానులు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. వినియోగదారులకు శుభ్రమయిన, నాణ్యాతతో కూడిన ఆహార పదార్టాలు అందించుటకు ప్రతిఒక్క వ్యాపారస్తుడు తప్పనిసరిగా FoSTaC శిక్షణ తీసుకోవాలని తెలిపారు. FoSTaC సర్టిఫికేట్ ప్రతి ఒక్క వ్యాపారస్తుని దగ్గర తప్పని సరిగా ఉండాలి ఆన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంసీఈడీ రీజనల్ కోఆర్డినేటర్స్ శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కొప్పుల రవి, సిబ్బంది దేవరాజ్, నవీన్, మన్నే కృష్ణ, కె.అనిల్, సతీష్, అనిల్, మనోహర్, రంజిత్, పవన్ పలువురు దుకాణదారులు, తదితరులు పాల్గొన్నారు.