calender_icon.png 8 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన జెండా బాలాజీ జాతర

08-09-2025 12:00:00 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జండా గల్లీలో గల జండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు ఈ రోజైనా  ఆదివారం ఆధ్యాత్మిక వాతావర ణంలో ముగిశాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు నగరపుర వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర బాలాజీ నామ స్మరణతో   జెండాను ఊరేగించి పూలాంగ్ సమీపంలో ప్రతిష్టించారు. గత 15 రోజులుగా నగరంలోని  బాలజీ ఆలయంలో కొనసాగిన జాతర ఆదివారంతో ముగిసింది.

వంశపారపర్యం అర్చకులు అజయ్ సంగ్వాయి, సంజయ్ సంగ్వాయి, విజయ్ సాంగ్వాయ్ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పౌర్ణమి రోజు సాయంత్రం జెండాతో పాటు ఉత్సవమూర్తులను శోభాయాత్ర పూలాంగ్ సమీపంలోకి తరలించడం ఆనవాయితీ.  ఈసారి చంద్రగ్రహణం ఉండడంతో ఉదయాన్నే జెండాను ఊరేగించారు. ఆలయం నుంచి సిర్నాపల్లి గడి గోల్ హనుమాన్ మీదుగా పూలాంగ్ బ్రిడ్జి సమీపంలో ప్రతిష్ఠించారు.

ఆదివారం పౌర్ణమి కావడంతో దర్శనానికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, ఆలయ చైర్మన్ లవంగప్రమోద్, ఈవో వేణు పాల్గొన్నారు. 

ఇది ఇలాఉండగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా జాతర లో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండాను దర్శించుకున్నారు. సంప్రదాయంగా వస్తున్న జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.