08-09-2025 12:00:00 AM
20 గ్రామాలను కలుపుతూ రింగు రోడ్డు
10న ఫైనల్ డ్రాఫ్ట్
కరీంనగర్, సెప్టెంబరు07 (విజయ క్రాంతి): కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంటా అథారిటీ(సుడా) మాస్టర్ ప్లాన్-20 41ను అధికారులు సిద్ధం చేశారు. అమృత్ స్కీం, అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ (యూడీపీఎఫ్) మార్గదర్శకాలను అనుసరించి ఈ మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. కరీంనగర్ పట్టణంలోని, పరిసరాల్లో ఉన్న 62 గ్రామాల పరిధిలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు ఈ మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు.
ఇప్పటికే ఈ మాస్టర్ ప్లాన్ పై ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యంతరాలను, సూచనలు, సలహాలను స్వీకరించారు. కొన్ని మార్పులతో ఈ నెల 10 న ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సి ద్ధమయ్యారు. ప్రస్తుతం అమలులో ఉన్న మాస్టర్ ప్లాన్-ను అప్పటి అవసరాలను దృ ష్టిలో ఉంచుకుని రూపొందించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ప్రకారం కొత్త సరిహద్దులు ని ర్ణయించారు.
దీన్ని ప్రకారం నుడా పరిధి తూర్పున తాహెర్ కొండాపూర్, ఈశాన్య మూల నుంచి మొదలై చెర్లబుత్కూర్, మొ గ్గుంపూర్, చేగుర్తి, లింగాపూర్, అన్నారం, ఈ దులగట్టిపల్లి గ్రామ సరిహద్దుల వెంబడి చెం జర్ల సరిహద్దు వరకు ఉంటుంది. పడమర వైపున గునుకుల కొండాపూర్ సరిహద్దు నై రుతి మూల నుంచి మొదలై ఉత్తరం వైపు జంగపల్లి, మాదాపూర్, కాశీంపేట, పారువె ల్ల, కాజీపూర్, ఒద్యారం, నాగులమల్యాల, వె లిచాల, వెదిర, కిష్టాపూర్ సరిహద్దు వెంబడి వాయవ్య మూల వరకు మాస్టర్ బౌండరీగా నిర్ణయించారు.
దక్షిణాన చెంజర్ల సరిహద్దు ఆగ్నేయ మూల నుంచి మొదలై పడవ వైపునకు మన్నెంపల్లి, నుస్తులాపూర్, కొత్తపల్లి, రేణికుంట, గునుకుల కొండాపూర్ సరిహద్దు నైరుతి మూల వరకు హద్దులు నిర్ణయించా రు. ఉత్తరాన కిష్టాపూర్ సరిహద్దు దేశరాజ్పల్లి, కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుం ట, చాకుంట, చామనపల్లి, తాహేర్ కొండాపూర్ ఈశాన్యం మూల వరకు సరిహద్దుగా ఉంది. వాణిజ్యం, మిశ్రమ, పరిశ్రమల జో న్లుగా కరీంనగర్లోని ప్రధాన రహదారుల వెం బడి ఉన్న ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకే వినియోగిస్తున్నప్పటికీ అవి రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉన్నాయి.
అందుకే నగరంలోని ప్రధాన రహదారులను వాణిజ్య జో న్యల పరిధిలోకి తీసుకువచ్చారు. నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు కలిసి ఉన్న ఏరియాలను మిశ్రమ జోన్లుగా ప్రతిపాదించారు. కరీంనగర్ భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కోసం స్పెషల్ ఇండస్ట్రియల్ జోన్లను మాస్ట ర్ ప్లాన్లో పొందుపరిచారు. 2.289 హెక్టార్ల లో ఇండస్ట్రియల్ జోన్ గా నిర్ధారించారు. ఈ జోన్ పరిధిలోకి ఆసిఫ్ నగర్, ఒద్యారం, నాగులమల్యాల, చెంజర్ల, ఎలగందల్, బద్దిపల్లి రానున్నాయి.
20 గ్రామాలను కలుపుతూ రింగ్ రోడ్డు..
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, వరంగల్ తరహాలో కరీం నగర్ కు రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఇది సుమారు 20 గ్రామాల సరిహద్దుల మీ దుగా పోనుంఇ. 200 ఫీట్ల వెడల్సుతో 138 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగురోడ్ను ని ర్మిస్తారు. కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ ర మదారిని కలుపుతూ ఓఆర్‌ఆర్ లో ఒక భా గం గునుకుల కొండాపూర్, జంగపల్లి, మా దాపూర్, ఖాసింపేట, పారువెల్ల, ఒద్యారం, నాగులమల్యాల, కొక్కెరకుంట, వెలిచాల శి వారు మీదుగా కరీంనగర్ -జగిత్యాల ప్రధాన రమదారిని కలుస్తుంది.
కొత్తపల్లి పట్టణం దాటిన తర్వాత కరీంనగర్ జగిత్యాల రహదా రి నుంచి కొక్కెరకుంట, జూబ్లీనగర్, ఎలబోతారం, ఇరుకుల్ల, దుర్శేడ్, బొమ్మకల్ గ్రామ శివారు నుంచి మానేరు నది మీదుగా మానకొండూర్, ముంజంపల్లి, పోరండ్ల, నుస్తులా పూర్ వద్ద రాజీవ్ రహదారితో కలుస్తుంది. హైదరాబాద్ను కలిపే కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పూర్తయితే నగరం కనెక్టివిటీ మరింత విస్తారంగా మారుతుంది.
సమగ్రాభివృద్ధి కోసమే సుడా మాస్టర్ ప్లాన్...
కరీంనగర్ సమగ్ర అభివృద్ధి కోసమే సుడా మా స్టర్ ప్లాన్ రూపొందించాం. 30 ఏళ్ల క్రితం నాటి మాస్ట ర్ ప్లాన్ అమలవుతోంది. నగరం చాలా విస్తరించిన నేపథ్యంలో రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించడంజరిగింది.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి