13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కమిషనరేట్‌లో సీపీఆర్‌పై శిక్షణ

31-03-2026 12:42 AM

మెడికవర్ ఆసుపత్రి వారి వైద్య శిబిరం

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాం తి): కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ జిల్లా కమిష నరేట్‌లో సిపిఆర్‌పై పోలీసులకు, రాపిడో ని ర్వాహకులకు శిక్షణ అందించారు. ఎవరైనా హార్ట్ ఎటాక్ గురైతే అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ ఎలా చేయాలో సిపిఆర్ శిక్షణ ఇస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని తెలిపారు.

అ దే విధంగా రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం పోలీసులు, వారి కు టుంబాలకు, రాపి డో నిర్వాహకులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి వైద్య పరీక్షలు చేశారు. మెడికవర్ ఆస్పత్రికి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లోకేష్, నర్సింగ్ సూపరింటెం డెంట్ లావణ్య, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, సంతోష్ పాల్గొన్నారు.