కుంటకట్టే మిగిలింది!
ఆక్రమణకు గురైన వడ్డెర కుంట
కేసముద్రం, మార్చి 30 (విజయక్రాంతి): మత్స్యకారులకు జీవనోపాధినిచ్చే చెరువు లు, కుంటలు రోజురోజుకు కబ్జాలకు గురవుతున్నాయని, ఇదే క్రమంలో కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామ పరిధిలోని వడ్డె ర కుంట ఆక్రమణకు గురైందని, దీనితో తమకు జీవనోపాధి కరువైందని ఆ గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలో పది ఎకరాలపైగా విస్తీర్ణంలో వడ్డెర కుంట ఉండేదని, ఇం దులో ప్రతి ఏటా తాము చేప పిల్లలు పెంచి జీవనోపాధి పొందే వారమని చెప్పారు.
గత కొంతకాలంగా వడ్డెర కుంట సమీపంలోని ఓ వ్యక్తి కొద్ది కొద్దిగా భూమిని ఆక్రమిస్తూ తా జాగా కుంటను పూర్తిగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. వివిధ రకాల పంటలను కుంట భూమిలో సాగుచేస్తూ, అందులో నీళ్లు నిలువకుండా కట్టకు చిన్న కాలువ ఏర్పాటు చేసి బయటకు వదులుతున్నాడని పేర్కొంటున్నారు.
దీనితో ఇప్పుడు కుంట భూమి పూర్తిగా మాయమైపోయిందని, కేవలం కట్ట మాత్రమే మిగి లిందని పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని మత్స్యకారుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. తమ జీవనోపాధికి భంగం వా టిల్లే పరిస్థితి ఏర్పడిందని, అధికారులు స్పం దించి కబ్జాకు గురైన వడ్డెర కుంటను పరిరక్షించాలని కోరుతున్నారు. వడ్డెర కుంట పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే త్వరలో కట్ట కూడా పూర్తిగా తొలగించి ఆ భూమిని కూ డా కబ్జా చేయడం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు.
అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు
ఆక్రమణకు గురైన వడ్డెర కుంట ను రక్షించాలని, అక్రమంగా అందులో సాగు చేస్తున్న పంటలను తొలగించి, హద్దులు నిర్ణయించి, కట్టకు ఏర్పాటు చేసిన కాలువను పూడ్చి, కుంటలో నీళ్లు నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ కు ఉప్పరపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు లితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న వడ్డెర కుంట ను కబ్జా నుండి కాపాడాలని, తమ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని వారు అదనపు కలెక్టర్ దృష్టికి వెళ్లారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తమకు హామీ ఇచ్చారని, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు జెనిగల అనిల్ కుమార్, భువనగిరి ఉప్పలయ్య, చాగంటి రాములు, అంకిరెడ్డి యాకయ్య, చంద్రయ్య, వీరయ్య, సురేష్, రాజకుమార్, రాజు, శ్రీనివాస్ తదితరులు పేర్కొన్నారు.




