calender_icon.png 6 May, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై నుంచి వచ్చిన నిపుణులతో జిఐఎస్ పై శిక్షణ

06-05-2025 08:06:41 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఐఐటి ముంబై నుండి వచ్చినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ జిఎస్ఐ(Geographical Information System) బేసిక్స్ పై శిక్షణ ఇచ్చి, దానిని ఉపయోగించి వివిధ రకాల మ్యాప్స్ తయారు చేయటం, తద్వారా ఆరోగ్యం, వ్యవసాయ రంగాలలో జిఐఎస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియచేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంజనీరింగ్ విద్యార్థులు, మెడికల్ కళాశాల, విద్యార్థులు వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ఐఐటి ముంబై ద్వారా ఇంటర్న్‌షిప్ చేసే విధంగా ప్రోత్సహించటం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ తరగతులు రేపు కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.