06-05-2025 09:30:41 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో జరిగింది. ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దంపేట గ్రామ పంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ చెత్త సేకరణ సమయంలో అతివేగంగా అజాగ్రత్త గా వచ్చిన ట్రాక్టర్ ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుని పైనుండి పోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు ధృవీకరించారు. బాలుని యొక్క తండ్రి జనగామ శ్రావణ్ ఫిర్యాదు మేరకు బాలుని మృతికి కారణమైన గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ డ్రైవర్ కురుసం రామకృష్ణ ఫై కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.