06-05-2025 09:27:01 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు అశ్వాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓరుగంటి వీరయ్య భవన్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం మిట్టగూడెంలోని ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో పాలు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే అని వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు, మండల ప్రజలు తరఫునుంచి కోరుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో గాదే కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, ఎస్.కె.షర్ఫుద్దీన్, ఎస్.కె.ఖదీర్, యేనిక రవి, తూము రాఘవులు, ఆవుల రవి, బూరెడ్డి వెంకటరెడ్డి, కాకా అశోక్, మాచిరెడ్డి వెంకటరెడ్డి, సామా కృష్ణారెడ్డి, చుంచు ఏకాంబరం, కిలారు శేషగిరి, గొల్లపల్లి నరేష్ హర్ష నాయక్, తెల్లం వీరభద్రం, ఎక్కటి సత్యనారాయణ రెడ్డి, మనాది సైదులు, సింగం శ్రీధర్, పాటి ప్రదీప్, మాదినేని సుబ్బారావు, బండారు వెంకటేశ్వర్లు, సంతపురి సతీష్, మేకల అంజిబాబు, సామకూరి వెంకన్న, బరాసు సంపత్, మట్టా వీరభద్రారెడ్డి, ఎస్.కె. గాలిబ్, వేముల విజయ్, గుర్రం తిరుపతి రావు, కుంజా జాను, కమ్మాల వెంకన్న, మురికిపూడి వెంకటేశ్వర్లు, ఊకె వెంకటేశ్వర్లు, రావులపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.