18-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నట్టు ప్రైవేట్ స్కూల్స్, విద్యార్థుల సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు షామిల్ అహ్మద్ తెలిపారు.
హైదరాబాద్‌లోని ట్రస్మా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రికగ్నుజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నేతృత్వంలో జరిగే శిక్షణకు భారత స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మ్ంర తిత్వశాఖ తోడ్పాటునందిస్తోందని చెప్పారు.
జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థుల మనోవికాసాన్ని అర్థం చేసుకొని, వారికి ఈ తరం పద్ధతులకు అనుగుణంగా బోధించడం, వారిలో మరింత నాణ్యత పెంచేందుకు ఈ శిక్షణ దోహదపడు తుందని తెలిపారు.