17-05-2025 09:33:39 AM
దోహా డైమండ్ లీగ్‌లో 90.23 మీటర్లతో కొత్త రికార్డు
దోహా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్‌లో కొత్త రికార్డును సృష్టించాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 90 మీటర్ల మేర బళ్లాన్ని విసరని నీరజ్ తాజాగా జరుగుతున్న పోటీల్లో 90.23 మీటర్ల మేర విసిరి రికార్డులకెక్కాడు. కెరియర్‌లో రెండు సార్లు ఒలంపిక్ మెడల్స్ సాధించినా కానీ నీరజ్ మాత్రం 90 మీటర్ల మార్కును అందుకోలేదు. 2022లో జరిగిన స్టాక్ హోం డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా 89.94 మీటర్ల మేర జావెలిన్‌ను విసిరాడు. దోహా డైమండ్ లీగ్ మొదటి రౌండ్‌లో 88.84 మీటర్లు, రెండో రౌండ్‌లో ఫౌల్, మూడో రౌండ్‌లో అంతా ఆశ్చర్యపోయే రీతిలో 90.23 మీటర్ల మేర జావెలిన్‌ను విసిరాడు.