calender_icon.png 19 May, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6 నుంచి 19 వరకు బడిబాట

18-05-2025 12:00:00 AM

రోజూవారీ కార్యక్రమాల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ప్రభుత్వ బడుల్లో విద్యా ర్థుల నమోదును పెంచడమే లక్ష్యం గా నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 6 నుంచి 19 వరకు చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్ 6వన గ్రామసభ నిర్వహించాలి. 7న ప్రతీ ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాలి.

8 నుంచి 10 వరకు కరపత్రాలతో ఇం టింటి ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన, డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం తో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి. 11న జూన్ 6 తేదీ నుంచి పదో తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష ఉంటుంది. 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజా ప్రతినిధులతో ప్రారంభించాలి.

అదేరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు అందించాలి. 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ, 16న ఎఫ్‌ఎ ల్‌ఎన్, ఎల్‌ఐపీ దినోత్సవం, 17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం, 18న తరగతి గదుల డిజిట లీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించడం, 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలని సూచించారు.