28 మంది ఐపీఎస్‌ల బదిలీ
18-06-2024 02:03 AM
హైదరాబాద్, జూన్ 17(విజయక్రాంతి): తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 28 మంది అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో కొందరు నాన్ క్యాడర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. తాజా ట్రాన్స్‌ఫర్స్‌తో పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమితులయ్యారు. అలాగే, బదిలీ చేసిన కొందరు అధికారులను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇటీవల సర్కార్ పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయగా, ఇక ఐపీఎస్‌ల బదిలీ కూడా ఉంటుందని ఎంతోమంది ఊహించారు. అనుకున్న విధంగానే ఆ బదిలీలు జరిగాయి.








