3 July, 2026 | 9:33 PM

Breaking News

నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •  

జనరల్ మజ్దూర్లుగా బదిలీ వర్కర్లు

31-08-2024 04:00 AM
  1. 2,364 మంది క్రమబద్ధీకరణకు ఆమోదం
  2. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి క్యాలెండర్ ఏడాదిలో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధుల నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని డైరెక్టర్లను ఆదేశించారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.

జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినందున ఇంకా బాధ్య తాయుతంగా వ్యవహరించాలని, డ్యూటీలకు గైర్హాజరు కావొద్దని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కంపెనీ ఆధ్వర్యంలో వెయ్యికి పైగా ఇంటర్నల్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని, అర్హులైన వారు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.