calender_icon.png 11 February, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్.. పట్టించుకోని అధికారులు

11-02-2026 12:28:25 AM

మాగనూరు ఫిబ్రవరి.10.మాగనూరు మండలంలో ని పలు గ్రామాల్లో, పొలాల వద్ద ఏర్పాటు చేసిన కంచలేనీ ట్రాన్స్ఫార్మర్లు దర్శనమిస్తున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచ లేక పోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మండల రైతులు ,ప్రజలు , తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..

గతంలో కంచలేని ట్రాన్స్ఫర్ల వద్ద పశువులు, గొర్రెలు, మేత కు వెళ్లి కరెంటు షాక్ తో మృతి చెందిన సం ఘటనలు ఉన్నాయని రైతులు తెలిపారు. గ్రామాల్లో అంతర్గత రహదారుల పక్కల ట్రా న్స్ఫార్మర్లు ఉండడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదము చోటు చేసుకుంటుందోనని స్థానిక ప్రజలు భయంతో ఉన్నామని తెలిపారు. అ ధికారులు స్పందించి కంచలేని ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేసిన ప్రమాదాలను అరికట్టాలని మండల ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.