7 June, 2026 | 2:00 AM

సోల్ ఆఫ్ లెనిన్‌కు అద్భుత స్పందన

07-06-2026 12:37 AM

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈనెల 26న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇటీవల మేకర్స్ ‘సోల్ ఆఫ్ లెనిన్’ అంటూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ ప్రదర్శనలకు ఈ ‘సోల్ ఆఫ్ లెనిన్’ను జోడించారు. ఈ ఉద్వేగభరితమైన, పవర్‌ఫుల్ పాటకు అభిమానుల, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తుందని మేకర్స్ తెలిపారు. అఖిల్ మాస్ అప్పీల్, యాక్టింగ్, ఎమోషన్స్ అన్నీ కూడా ఈ పాటలో కనిపిస్తున్నాయి. పాటలు, గ్లింప్స్, పోస్టర్లతోనే సినిమాపై అంచనాలను గణనీయంగా పెరిగాయి. ఈ సినిమాకు సంగీతం థమన్, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫర్గా, నవీన్ నూలి ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు.