10 June, 2026 | 6:18 PM

Breaking News

జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •  

రూ. 176.20 కోట్లతో గిరిజన సహకార సంస్థ వార్షిక ప్రణాళిక

25-03-2026 01:50 AM

ఉట్నూర్, మార్చి 24 (విజయక్రాంతి): ఉట్నూర్ డివిజన్ పరిధిలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ. 176.20 కోట్ల తో వార్షిక ప్రణాళిక ప్రతిపాదనలు ఖరారు చేసినట్లు జీసీసీ ఉట్నూర్ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ తెలిపారు.

ఆమోదం కోసం జీసీసీ మేనేజంగ్ డైరెక్టర్ కి ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉట్నూర్ డివిజన్ కార్యాలయంలో డివిజన్ లోని మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, శ్రీనివా స్, రమేష్, మనోహర్, లక్ష్మణ్, సిబ్బంది లింబారావు, సత్యనారాయణ, సంతోష్ పాల్గొన్నారు.