calender_icon.png 12 October, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్‌లో సామూహిక అత్యాచారం.. గిరిజన మహిళ మృతి

12-10-2025 12:54:29 PM

హైదరాబాద్: మెదక్ జిల్లాలో అత్యాచారానికి గురై తలకు గాయంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న 33 ఏళ్ల గిరిజన మహిళ ఆదివారం మరణించింది. మెదక్ జిల్లా, జానకంపల్లి పంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ దినసరి కూలీ పని కోసం శుక్రవారం తన ఇంటి నుండి బయలుదేరింది. సాయంత్రానికి ఇంటికి రాలేదు. శనివారం ఉదయం కుల్చారం మండలంలోని ఒక చెట్టు కింద ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా సదరు మహిళను ఓ స్తంభానికి చేతులు కట్టేసి ఉండగా.. బాధితురాలి శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయి.

మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆ తర్వాత హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలిస్తుండగా శనివారం రాత్రి మార్గమధ్యలో మరణించారని పోలీసు అధికారి వెల్లడించారు. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, మొదట అత్యాచారం, హత్యాయత్నం కేసు నమోదు చేశామని, మహిళను అత్యాచారం చేసి బండరాయితో తలపై మోది హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు.ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందనే నివేదికలపై, వారు మరింత దర్యాప్తు చేస్తున్నామని, సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.