calender_icon.png 5 February, 2026 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఆదివాసీ యువకుడు

05-02-2026 12:00:00 AM

అశ్వాపురం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని మారుమూల గ్రామం మామిళ్లవాయి నుంచి జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికై మండలానికి గర్వకారణంగా నిలిచిన ఆదివాసీ యువ క్రీడాకారుడు నవీన్ను బుధవారం కాంగ్రెస్ పార్టీ ఘనంగా సన్మానించింది. ఎన్నో కష్టాలు, బీదరికాన్ని అధిగమిస్తూ కఠోర శిక్షణతో ఈ స్థాయికి చేరుకున్న నవీన్ పలువురు క్రీడాకారులకు ఆదర్శమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ప్రశంసించారు.

ఈ సందర్భంగా నవీన్ సొంత గ్రామంలో ఉన్న ఆయన స్వగృహంలో మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శాలువాతో సత్కరించి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు మచ్చ నరసింహారావు, ఎట్టి నరేష్, సబ్కా పిచ్చయ్య, కుంజ జాను, ఉపసర్పంచ్ హర్ష నాయక్, తూము పెద్ద రాఘవులు, బేతం రామకృష్ణ, బచ్చు వెంకటరమణ, చెంచల రాము, పద్దం నరసింహారావు, అంకుశ ఆలి, శశికాంత్, తెల్లం నాగరాజు, కొండ్రు నాగేశ్వరావు, ఇరుప వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.