ప్రిన్సిపాల్ రూపారెడ్డికి నివాళి
21-08-2026 12:09 AM
క్రియేటివ్ హైస్కూల్‌లో శ్రద్ధాంజలి కార్యక్రమం
నల్లగొండ, ఆగస్టు 20 (విజయక్రాంతి): క్రియేటివ్ హైస్కూల్‌లో నల్లగొండ ప్రిన్సిపాల్ రూపపారెడ్డి హత్య పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఆమెకు గౌరవ సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ బిజ్జాల కమలాకర్, డైరెక్టర్ బిజ్జాల కౌషిక్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






