ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు తీసుకోవాలి
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
అల్వాల్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): ప్రతి ఒక్క తాపీ మేస్త్రీ తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. గురువా రం ఖానాజిగూడ టెలికం కాలనీలో ఓం సాయి తాపీ మేస్త్రి వర్కర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో ’మేస్త్రి యూనియన్ గుర్తింపు కార్డులను’ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, సీనియర్ నేత నందికంటి శ్రీధర్ తో కలిసి గుర్తింపు కార్డులను’ పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీరు అందరూ కలిసి కట్టు గా ఉండి మీ పనులను చేసుకోవాలన్నారు. పని చేసే వారంరికీ గుర్తింపు కార్డులు ఉండాలని, మీరందరూ తప్పనిసరిగా ఈ కార్డ్ తీ సుకోవాలని సూచించారు. తన శాయ శక్తు ల యూనియన్ కు సహయ సహాకారం అం దిస్తూ ఎల్లవేళలా అండదండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్మికులకు భరోసానిచ్చా రు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, శ్రీని వాస్, శ్రీధర్ గౌడ్, సురేష్ రెడ్డి, సరిత, అమృత, భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కామల్ల ఐల య్య చైర్మన్ పెద్ద నరసింహ, వెంకట్రావు, మాల్యాద్రి రెడ్డి, వెంకట్రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు






