30-01-2026 12:13:07 PM
రామేశ్వర్‌పల్లిలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
కామారెడ్డి,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఎడ్ల రాజ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ చేపూరి రాణీ రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్‌తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై గాంధీజీ సేవలను స్మరించుకున్నారు.