calender_icon.png 30 January, 2026 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టులో చెల్లని రిట్ పిటిషన్

30-01-2026 01:48:54 PM

నీళ్లు ఏపీకి ధారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోం

హైదరాబాద్: సుప్రీంకోర్టులో(Supreme Court) ఈ ప్రభుత్వం చెల్లని రిట్ పిటిషన్ వేసిందని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) అన్నారు. పథకం ప్రకారమే పోలవరం-నల్లమల్ల సాగర్ కు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నది పేరుకే జలవివాదాల కమిటీ సమావేశం అన్నారు. పోలవరం- నల్లమలసాగర్(Polavaram-Nallamala Sagar)కు పరిష్కారం కోసమే ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నారని వెల్లడించారు. సుప్రీంకోర్టు లో చెల్లని పిటిషన్ వేసి రిట్ ను వాపస్ తీసుకున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలించుపోయే కుట్ర జరుగుతోందన్నారు. తాను ప్రశ్నించిన తర్వాత వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు.

రెండు కండీషన్లు పెట్టి ఢిల్లీలో సమావేశానికి వెళ్లారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం(AP Government) నల్లమలసాగర్ డీపీఆర్ కు ఆపాలని షరతు పెట్టారని వివరించారు. నల్లమలసాగర్ కు సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వొద్దని రెండో షరతు పెట్టారని చెప్పారు. రెండు షరతులకు కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వకుండానే సమావేశానికి ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. నల్లమలసాగర్ కు ఒప్పుకుని తెలంగాణకు మరణశాసనం రావాలని అనుకుంటున్నారా? తెలంగాణ నీళ్లు ఏపీకి ధారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశానికి కూడా ఆదిత్యనాథ్ దాసునే పంపించారని ఆరోపించారు. ఆదిత్యనాథ్ దాస్ గతంలో ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేశారని చెప్పారు.

ఆదిత్యనాథ్ దాస్(Adityanath Das) గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడిన వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రం తరఫున వాదనలకు వెళ్లారన్నారు. తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో గోదావరిపై 7 ప్రాజెక్టులకు డీపీఆర్ లను పంపించామని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి తాము సిద్ధమన్నారు. చంద్రబాబు ఒత్తిడితో ఢిల్లీలో జరుగుతున్న సమావేశాన్ని రాష్ట్రం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశాన్ని బహిష్కరించకుండా పాల్గొంటే మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.