3 July, 2026 | 10:47 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

2028కల్లా 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ

03-10-2024 12:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 2 :  ప్రభుత్వం చేపడతున్న చర్యలు, యూపీఐ, 5 జీ అడాప్షన్‌తో భారత్ 2028వ సంవత్సరానికల్లా 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీగా ఆవిర్భవిస్తుందని ఆస్క్ క్యాపిటల్ నివేదికలో వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలు పెరగడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఇంటర్నెట్ వ్యాప్తిచెందడం, 4జీ, 5జీ సర్వీసులు అందుబాటులో ఉండటం భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థలో సమగ్ర మార్పులు చోటుచేసుకున్నాయని, యూపీఐ వంటి నవ టెక్నాలజీలు భారత ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేస్తున్నట్లు వివరించింది. 

2027 సంవత్సరానికల్లా దేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో  90 శాతం యూపీఐ ద్వారా జరుగుతాయని అంచనా వేసింది. డిజిటలైజేషన్‌లో ధనిక దేశాలైన యూకే, జపాన్, జర్మనీలను కూడా భారత్ మించిపోయిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్‌ఐఈఆర్) ఇటీవల వెల్లడించింది.