3 July, 2026 | 11:49 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

600 కొత్త శాఖల్ని జతచేస్తాం: ఎస్బీఐ చైర్మన్

03-10-2024 12:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో తమ బ్రాంచ్ నెట్‌వర్క్‌లో కొత్తగా 600 శాఖల్ని జతచేయాలని యోచిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. నూతనంగా ఆవిర్భవిస్తున్న రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌ల్లో వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు శాఖల్ని భారీగా విస్తరించాలన్న ప్రణాళికలు ఉన్నాయని, ప్రస్తుత ఏడాదే 600 శాఖల్ని ప్రారంభిస్తామన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 137 శాఖల్ని ప్రారంభించగా, అందులో 59 శాఖల్ని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పింది. 2024 మార్చినాటికి దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 22,542 శాఖలు ఉన్నాయి. ఇవి కాకుండా బ్యాంక్‌కు 65,000 ఏటీఎంలు, 85,000 బిజినెస్ కర్‌స్పాండెంట్‌లు ఉన్నారు. తాము 50 కోట్ల మంది ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని ప్రతీ భారతీయు కుటుంబానికి బ్యాంకర్‌గా ఉన్నందుకు తాము గర్విస్తున్నామని శెట్టి చెప్పారు.