16-07-2025 12:00:00 AM
యోగేశ్ కల్లే, సన్నీలియోన్, ఆకృతి అగర్వాల్, మొట్టా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘త్రిముఖ’. ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. ప్రతి ఫ్రేమ్ సస్పెన్స్‌తో నిండి ఉన్నట్టు మోషన్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.
“త్రిముఖ’ ఒక రహస్య కథ. ఒక మానసిక ప్రయాణం. ఒక నమ్మలేని వాస్తవం. త్వరలో థియేటర్లలో వాస్తవాన్ని చూపేందుకు సిద్ధమవుతోంది” అంటూ టీమ్ ఈ మోషన్ పోస్టర్‌కు జోడించిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.