16-07-2025 12:00:00 AM
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ’. స్టార్ హీరో యష్ ఇందులో రావణాసురుడిగా కనిపించనున్నారు. ఇతిహాస గాథ కావడం.. రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటంతో భారీగా ఖర్చు పెట్టడం ఖాయమన్న సంగతి అందరికీ తెలిసిందే.
అన్ని సంస్థల్లాగానే ఈ సంస్థ కూడా ఎంత మొత్తం అనేది మాత్రం ఇంతకాలం బయటపెట్టలేదు. అయితే, అనూహ్యంగా ఈ ప్రాజెక్టు బడ్జెట్‌ను అధికారికంగా రివీల్ చేసి షాకిచ్చారు నిర్మాత నమిత్ మల్హోత్రా. ఈ సినిమా రెండు భాగాలకు కలిపి అక్షరాలా రూ.4 వేల కోట్లు బడ్జెట్‌ను పెడుతున్నట్టు వెల్లడించారు.