calender_icon.png 20 July, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంత్ తుకారాం విడుదల ఆ రోజే

16-07-2025 12:00:00 AM

ఆదిత్య ఓం దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా ఎన్ని రకాల ప్రయోగాల్ని చేస్తూ ఉన్నారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ‘సంత్ తుకారాం’ అంటూ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పురుషోత్తం స్టూడియోస్, కర్జన్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 17వ శతాబ్దపు మరాఠీ సాధువు-, కవి, భక్తిని ప్రతిఘటనగా మార్చిన సంత్ తుకారాం జీవితం, వారసత్వం, సాహిత్య విప్లవం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిం చారు.

ఈ చిత్రంలో ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. శివ సూర్యవంశీ, షీనా చౌహాన్, సంజయ్ మిశ్రా, అరుణ్ గోవిల్, శిశిర్ శర్మ, హేమంత్ పాండే, గణేశ్ యాదవ్, లలిత్ తివారీ, ముఖేశ్ భట్, గౌరీ శంకర్, ట్వింకిల్ కపూర్, రూపాలి జాదవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూలై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.