calender_icon.png 16 November, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రివేణి భాషా సంగమం నారాయణఖేడ్

16-11-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ట్రంలో త్రివేణి సంగమంగా సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని పేర్కొనవచ్చు. నారాయణఖేడ్ ప్రాంతం కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలతో సరిహద్దుగా ఉండటంతో ఈ ప్రాంతంలో తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, హిందీ, లంబాడ (గిరిజన) భాషలతో పాటు అక్షరాస్యపరంగా అభివృద్ధి చెందుతూ ఆంగ్ల భాషను సైతం మాట్లాడే సత్తా ఉన్న ప్రాంతంగా నారాయణఖేడ్ ప్రాంతం దాదాపు 8 భాషల కలయికతో త్రివేణి భాషా సంఘముగా వర్ధిల్లుతున్నది. 

నారాయణఖేడ్ ప్రాంతం కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలతో సరిహద్దుగా ఉండటంతో ఈ ప్రాంతంలో జనాభాలో 90 శాతం మంది విభిన్న భాషలను మాట్లాడగలిగే ప్రాంతంగా బహు భాష సంఘాల కలయికగా వర్ధిల్లుతున్నది.

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలానికి మహారాష్ట్ర లోని మద్నూరు, నాగలిగిద్ద మండలానికి కర్ణాటకలోని బీదర్, ఔరాద్ ప్రాంతాలు సరిహద్దులుగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, హిందీ, లంబాడ (గిరిజన) భాషలతో పాటు అక్షరాస్యపరంగా అభివృద్ధి చెందుతూ ఆంగ్ల భాషను సైతం మాట్లాడే సత్తా ఉన్న ప్రాంతంగా నారాయణఖేడ్ ప్రాంతం దాదాపు 8 భాషల కలయికతో త్రివేణి భాషా సంఘముగా వర్ధిల్లుతున్నది.

భాషా ఎత్తు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో నారాయణఖేడ్ ప్రాంతం కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలతో కలిసి ఉండగా ప్రత్యేక భాషా రాష్ట్రాల ఏర్పాటుతో నాడు ఆంధ్రప్రదేశ్లో ఉండగా నేడు తెలంగాణలో విభిన్న సంస్కృతుల వైభవంగా వెలుగుతుంది. నియోజకవర్గంలో జనాభా 2010 ప్రకారం చూస్తే 2 లక్షల పైగా జనాభా ఉండగా ప్రస్తుతం ఓటర్లపరంగా చూస్తే రెండు లక్షల 37వేల 485 ఓటర్లు ఉన్నారు. 200 వరకు గిరిజన తండాలు ఉన్నాయి. కాగా నూతనంగా ఏర్పడిన మండలాలతో కలిపి ఏడు మండలాలుగా నారాయణఖేడ్ ప్రాంతం కొనసాగుతుంది.     

-ఈ ప్రాంతంలో ప్రతి వ్యక్తి దాదాపుగా మూడు నుండి నాలుగు భాషలను అనర్ గళంగా మాట్లాడ గలుగుతారు, కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు భాషలతో పాటు గిరిజనుల భాష అయినా లంబాడ భాషను అన్ని వర్గాల ప్రజలు అన్నరుగళంగా, సరళంగా అర్థం చేసుకుంటూ మాట్లాగలుగుతారు. -సరిహద్దులతో బంధుత్వ సంబంధాలు: నారాయణఖేడ్ ప్రాంతం కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులతో బంధుత్వ సంబంధాలు సైతం పెనవేసుకొని ఉన్నాయి. దీంతో సరిహద్దులు ఏ గ్రామానికి వెళ్ళిన ఏ ప్రాంతానికి వెళ్ళిన ఆ భాషలో మాట్లాడడం సహజంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. 

ఆధ్యాత్మిక ప్రభావం

నారాయణఖేడ్ ప్రాంతంలో భక్తి మార్గం, దైవభక్తి అత్యధికంగా ఉంది. కర్ణాటకలోని బసవేశ్వరుడు వీరశైవ లింగాయత్ సమాజం, మహారాష్ట్రలోని ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రం పండరీపూర్ వార్కారి సాంప్రదాయం ఇక్కడ నిత్యం మారు మోగుతుంది. వీటితోపాటు బడే పహాడ్, గుల్బర్గా, బసవ కళ్యాణ్, గానుగాపూర్, ధారూరు వంటి ప్రాంతాల్లో సందర్శిస్తూ ప్రజలు నిత్యం తమ ఇష్టదైవాలను పాటిస్తారు. ఇక్కడి ప్రాంత ప్రజలు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా తిరిగి వస్తారని స్థానికులు అనుకుంటారు. ఇప్పుడిప్పుడే రాజస్థానీ భాష సైతం నారాయణఖేడ్ ప్రాంతంలో మాట్లాడగలుగుతున్నారు. 

 కక్కేరివాడ సంగారెడ్డి, (నారాయణఖేడ్ విజయక్రాంతి)

నేను 8 భాషలను మాట్లాడగలను

మాది కంగ్టి మండలం. నేను ఎనిమిది భాషలను మాట్లాడగలను. నారాయణఖేడ్ ప్రాంతంలో ఆరు భాషలు ఉండగా ఆంగ్లం, కోయ భాషను సైతం మాట్లాడగలుగుతాను. చిన్ననాటి నుంచి అన్ని భాషల్లో మిత్రులతో కలిసి ఉండటంవల్ల నేర్చుకున్నాను.

గంగారం, కంగ్టి

మరాఠీ భాష మాట్లాడగలను

నేను మరాఠీ భాషను సైతం మాట్లాడగలను. నారాయణఖేడ్ ప్రాంతంలో పుట్టినప్పటికీ కూడా మరాఠీ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడగలను. మాకు నారాయణఖేడ్‌లో ప్రింటింగ్ ప్రెస్ ఉంది. దీంతో చిన్ననాటి నుంచి వివిధ భాషలను అందరితో మాట్లాడుతూ సహజంగానే నేర్చుకున్నాను. లంబాడా, ఇంగ్లీషు భాషలను అర్థం చేసుకోగలను. 

 నగేష్, నారాయణఖేడ్