calender_icon.png 6 December, 2024 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ స్టేడియంలో ట్రస్మా నాయకుడి ప్రచారం

07-10-2024 07:54:03 PM

కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ట్రస్మా నాయకుడు యాదగిరి శేఖర్ రావు సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ... ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్న తనకు వాకర్స్, మేధావులు మద్దతు పలకాలని కోరారు. అంబేద్కర్ స్టేడియంలో సౌకర్యాల కల్పనకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు స్కాలర్షిప్స్ కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి విడుదల చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం వాకర్స్కు ఎన్రోల్మెంట్ ఫాంను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్, రిటైర్డ్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.