7 April, 2026 | 3:24 PM

Breaking News

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •  

సేవా చేయడంలోనే నిజమైన సంతృప్తి

07-04-2026 02:03 PM

- వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పక్కాగా చేయండి 

-ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ టౌన్ 7 : సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్ యార్డ్ లో చలివేంద్రం ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ఉండేందుకు చలివేంద్రాల ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాలకు రోజూ భారీ సంఖ్యలో వచ్చే వ్యాపారులు, కూలీలు, వినియోగదారులు తీవ్రమైన ఎండల కారణంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కార్పొరేటర్ అనురాధ చిన్నని ప్రశంసించారు.

అనంతరం నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ భవనాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా గుత్తేదారుతో నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, వర్షాకాలంలో వర్షపు నీరు మార్కెట్ లోపలికి చేరకుండా సమగ్ర డ్రైనేజ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. వ్యాపారస్తులకు ఉపయోగపడే విధంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతను కాపాడుతూ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని గుత్తేదారుకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈసందర్భంగా  వీధి వ్యాపారులతో ముచ్చటించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పండ్ల వ్యాపారులను ప్రోత్సహిస్తూ స్వయంగా పండ్లు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, స్థానిక నాయకులు వర్థ రవి, రఘు దాసరి, గోపి నాయక్, మార్కెట్ వ్యాపారులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.