మొబైల్‌ఫోన్ల అప్పగింత
12-08-2026 12:45 AM
అర్మూర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి) : ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా సేకరించి ఐదుగురు బాధితులకు అప్పగించినట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఇందులో రెండు సంవత్సర క్రితం మూడు మొబైల్స్ , ఒక సంవత్సరం లోపు రెండు మొబైల్స్ పోయినట్లు పేర్కొన్నారు. గట్టు నరసయ్య, మహమ్మద్ నవీద్, బొమ్మ సాయికుమార్, పుట్ట శోభ, సాయి తేజలకు అప్పగించినట్లు వివరించారు.






