20-09-2025 10:48:17 AM
హైదరాబాద్: గోల్కొండ హనీట్రాప్(Golconda Honey Trap Case) కేసు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు నిందితులను రెండు రోజులు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం ఐదుగురు నిందితులు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజినిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బాధితుడిని బెందిరించి నిందితులు డబ్బులు వసూలు చేశారు. నిందితులకు బాధితుడు రూ. 50 లక్షల చెక్కులను ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా రెచ్చిపోయిన నిందితులు మరో రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో హానీట్రాఫ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.