డాలర్‌పై ట్రంప్ సంతకం
- జూన్‌లో ఆయన సంతకం గల డాలర్ నోట్లు విడుదల
- ప్రకటించిన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ
- అమెరికా చరిత్రలో తొలిసారి
వాషింగ్టన్, మార్చి 27: అమెరికా చరిత్ర లో మునుపెన్నడూ చూడని అధ్యాయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాంది పలికారు. ఇకపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో డాలర్ నోట్లను ముద్రించనున్నారు. ట్రంప్ సంతకంతో తొలి 100 డాల ర్ల నోటును జూన్‌లో విడుదల చేస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా తెలిపారు. అధ్యక్షుడు పదవిలో కొనసాగుతున్న తరుణంలోనే ఆయన సంతకంతో కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం సిద్ధం కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం ట్రెజరీ సెక్రటరీ, ట్రెజరర్ల సంతకాలతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు.
1861 నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్, ట్రెజరర్ లిన్‌మాలెర్బాల సంతకాలు ఉన్న డాలర్ నోట్లు ప్రస్తుతం అమెరికాలో చెలామణిలో ఉన్నాయి. ఈ విధానానికి ట్రంప్ చెక్ పెట్టా రు. ఇకపై అధ్యక్షుడు, ట్రెజరీ సెక్రటరీ సంతకాలతో నోట్లు విడుదల కానున్నాయి. ఈ మార్పులతో జూన్‌లో మొదటగా 100 డాల ర్ల నోటును విడుదల చేయనున్నట్టు స్కాట్ బెసెంట్ తెలిపారు. అమెరికా 250వ స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అమెరికా ట్రెజరర్ బ్రాండెన్ బీచ్ కూడా మద్దతు పలికారు. ట్రంప్ ఈ గౌరవానికి పూర్తిగా అర్హుల ని పేర్కొన్నారు. త్వరలో ట్రంప్ చిత్రం ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ నాణేం విడుదల చేస్తారు.




