‘టీఎస్ కాప్’ యాప్ హ్యాక్!
120 డాలర్లకు ఆన్‌లైన్‌లో అమ్మకం?
సోషల్‌మీడియాలో సైబర్ నేరగాళ్ల పోస్టులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి) : సైబర్ నేరగాళ్లను కట్టడి చేసే పోలీసు అధికారులను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. ఇటీవలే తెలంగాణ పోలీస్ ‘హ్యాక్ ఐ’ యాప్‌ను హ్యాకింగ్‌కు చేసిన హ్యాకర్స్ తాజాగా టీఎస్ సీఓపీ(రియల్ టైం పోలిసింగ్) యాప్‌ను సైతం హ్యాక్ చేసినట్లు సమాచారం. ఈ యాప్‌లో రాష్ట్ర పోలీసులకు సంబంధించిన డేటాని 120 డాలర్లకు విక్రయిస్తామంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు సైతం ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ రెండు యాప్స్‌లో సుమారు 12 లక్షల మందికి సంబంధించిన డేటా ఉందని, ఇప్పడు సమాచారం అంతా బహిరంగంగా విక్రయానికి ఉంచడం కలకలం రేపుతోంది. డబ్ల్యూఐఎన్సీ ఐటీ సర్వీసెస్ కంపెనీ, టీఎస్ కాప్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ఏ భద్రత లేకుండా పొందుపరచడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది.
దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఈ హ్యాకింగ్‌కు పాల్పడుతున్న కేటుగాళ్లను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇక వరుసగా పోలీసులకు చెందిన యాప్‌లు హ్యాకర్ల బారిన పడుతుండటంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే మీ డివైజ్ కు బలమైన పాస్‌వర్డులు పెట్టుకోవాలని, నమ్మకమైన సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించాలని అందరికి చెప్పే మీరే అలా చేయకపోవడం ఏంటో అంటూ సెటైర్లు వేస్తున్నారు.






