4 July, 2026 | 7:01 PM

తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

24-05-2024 04:59 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ను  ఈఎపి సెట్ కమిటీ విడుదల చేసింది. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జాన్ 30 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లను ఎంచుకునేందుకు అవకాశం కల్పించింది. జూలై 12వ తేదీన మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు చేయనున్నారు. జూలై 19 నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించగా, జూలై 24న సీట్ల కేటాయింపు, తుదివిడత కౌన్సెలింగ్ జూలై 30న ప్రారంభిస్తారు. ఆగస్టు 5న తుదివిడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగనున్నట్లు టిజి ఈఎపి సెట్ కమిటీ పేర్కొంది.