అర్ధరాత్రి పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
62 వేల నగదు, ఐదు కార్లు, 8 మొబైల్స్ స్వాధీనం.
మనోహరాబాద్,(విజయ క్రాంతి): విశ్వసనీయ సమాచారం మేరకు, అర్ధరాత్రి సమయంలో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సుభాష్ గౌడ్ తన సిబ్బందితో కలిసి కల్లకల్ గ్రామంలో అక్రమ జూద కార్యకలాపాలపై ఆకస్మిక దాడి నిర్వహించారు. కొత్తకాపు వెంకటేష్ అద్దెకు ఇచ్చిన ఒక గదిలో కొంతమంది వ్యక్తులు డబ్బుతో మూడు ముక్కలాట ఆడుతూ జూదంలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. దాడి సందర్భంగా ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుండి 62,490 నగదు 8 మొబైల్ ఫోన్స్ సంఘటనకు ఉపయోగించిన 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. జూదానికి ఉపయోగించిన ప్లేయింగ్ కార్డ్స్, ఇతర సామగ్రిని, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరు పరచడానికి చర్యలు తీసు కుంటున్నారు. అక్రమ జూద కార్యకలాపాలపై మనోహరాబాద్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని తెలిపారు. ప్రజలు ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సుభాష్ గౌడ్ పేర్కొన్నారు.






