23 April, 2026 | 1:06 PM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

23-04-2026 11:26 AM

- క్రైమ్ టీం చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్.

- 12.50 లక్షల విలువైన నగలు కారు, రెండు ద్విచక్ర వాహనాలు 61 ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

 - నిందితులను చేవెళ్ల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచయం జైలుకు తరలించిన వైనం.

- పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు.

చేవెళ్ల ఏప్రిల్ (విజయక్రాంతి): షాద్నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన రైతు గంటెల్లి వెంకటయ్య (60 సంవత్సరాలు) ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ నెల 17న ఉదయం 10:30 గంటల నుండి 10:35 గంటల మధ్య తన ప్యాంట్ జేబులో సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు (రూ. 8,40,000/- విలువ) తీసుకెళ్లారు. చేవెళ్ల బస్ స్టాండ్‌కు చేరుకుని షాద్‌నగర్‌కు వెళ్లే బస్సులో ఎక్కిన తర్వాత ఆ బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. బాధితుని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఈ పని అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్ చేసినట్లు తెలిసింది. కేసును ఛేదించేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సుధీర్ బాబు, చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్, చేవెళ్ళ ఏసీపీ బి. కిషన్ పర్యవేక్షణలో ప్రత్యేక క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేశారు.

ఈ నెల18న రాత్రి సమయంలో చేవెళ్ల పోలీసు క్రైమ్ టీమ్స్ సంయుక్తంగా పట్టుకోవడానికి ప్రయత్నించగా బేతంపల్లి మేరీ (22), దేవరకొండ రేణుక (32), పాలేరు సుష్మిత (21), ఆకుల గంగయ్య (32), ఇద్దరు జువెనైల్‌లు (CCL-1 & CCL-2), 7 కిలోమీటర్లు పారిపోగా వారిని మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రతాప సింగారం గ్రామస్తుల సహకారంతో పోలీసు పట్టుకున్నారు. ప్రథమ నిందితులైన బేతంపల్లి రాజశేఖర్, ఎరుకల దేవరకొండ నాగేంద్ర, చందు, ఆకుల చరణ్ కుమార్, నిందితులు అక్కడి నుండి పారిపోయారు. పోలీసులు సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు (అందులో 3 తులాల ఒక పుస్తెల తాడు,  మ్యారేజ్ నెక్లెస్, సుమారు ఒక తులం చెవి కమ్మలు, ఒక తులం మెడ గొలుసు, రెండు ఉంగరాలతో పాటు 61 మొబైల్ ఫోన్లు, 1 ట్యాబ్, 1 KUV కారు (TS10EQ2462), 1 TVS జూపిటర్ (AP39HZ0486), 1 బుల్లెట్ మోటార్ సైకిల్ (TG30B0301) లను ఈ ముఠా నుండి స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్‌గా పనిచేస్తూ, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సంతలు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని బంగారం, నగదు, మొబైల్ ఫోన్ల దొంగతనాలు చేస్తూ ఉండేదన్నారు. నేరాలు చేయడానికి జువెనైల్‌లను కూడా వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఈ గ్యాంగ్ కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీస్ స్టేషన్, బెంగళూరు, RPS సికింద్రాబాద్ పరిధిలో కూడా నేరాలలో పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. తెలంగాణలో ఈ నేరస్తులు దొంగిలించిన ఫోన్ ల గురించి వివిద పోలీసు స్టేషన్ లలో case లు నమోదు  అయినయని చెప్పారు. పట్టుబడిన నిందితులు జువెనైల్‌లను ఈ నెల 19న చేవెళ్ళ న్యాయస్థానంలో హాజరు పరిచమని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఈ గ్యాంగ్ చేసిన ఇతర నేరాలపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. రికవరీ చేసిన దొంగిలించిన సొమ్ము విలువ 12,50,000/- ఉంటుందన్నారు. అక్రమార్జన ద్వారా నిందితులు కొన్న వాహనాల విలువ 5,00,000/- ఉందని వాటిని సీజ్ చేశామని చెప్పారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దొంగల ముఠాలు ముఖ్యంగా బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లు తీసుకెళ్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటాయన్నారు.

ప్రజల ప్రభుత్వం గా ఉండాలి

విలువైన వస్తువులను బహిరంగంగా జేబుల్లో పెట్టుకోవద్దని ప్రజలు తమ వస్తువులను సురక్షితంగా ఉంచుకొని, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో(బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లు, వారాంతపు సంతల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు దగ్గరకు వచ్చి దృష్టి మరల్చే ప్రయత్నం చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, బస్సులో ఎక్కేటప్పుడు ప్రయాణించేటప్పుడు నేరస్తులు దొంగతనం చేసే ఆవకాశం ఉంటుందని ప్రయాణికులు వస్తువులను, విలువైన బంగారం నగదును జాగ్ర్తత్త గా ఉంచుకోవాలన్నారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని లేదా అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయలని చేవెళ్ల ఏసిపి కిషన్ ప్రజలను కోరారు.