calender_icon.png 24 January, 2026 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎస్ యుటిఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

26-09-2024 08:52:54 PM

హుజూర్ నగర్,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈనెల 29, 30 తేదీలలో జరిగే జిల్లా ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సీనియర్ నాయకులు చెన్న సైదులు, జిల్లా కార్యదర్శి ఆర్ దామోదర్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో టీఎస్ యుటిఎఫ్ ముందు ఉంటుందని, ప్రభుత్వం పెండింగ్ డిఏలు మంజూరు చేయాలని, పిఆర్సి ప్రకటించాలని మరియు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. తదనంతరం ఉపాధ్యాయుల సమక్షంలో మహాసభల పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ, జహోర్ అలం, లక్ష్మీకాంత్,  వెంకటేశ్వర్లు, ప్రభాకర్ రెడ్డి ,చిక్కుళ్ళ గోవింద్, జనార్దన్ రెడ్డి, కమల,సుహాసిని,జ్యోతి, రేణుక పాల్గొన్నారు.